NEWS@05:00 P.M | 7 జూలై 2026 ముఖ్యాంశాలు
‘సముద్రం మనల్ని విడదీయలేదు’.. మోదీ ప్రసంగం !
ప్రధాని మోదీ ఇండోనేషియా పర్యటనలో ఆ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య 20 కీలక ఒప్పందాలు జరిగాయి, మోదీకి అత్యున్నత పురస్కారం దక్కింది. Click here to read the full news.
పర్యాటకులను కట్టిపడేస్తున్న ఖరల్ దాస్ జలపాతం
ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని 500 అడుగుల ‘ఖరల్ దాస్’ జలపాతం భారీ వర్షాలతో జలకళను సంతరించుకుని, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. Click here to read the full news.
హిమాన్షుకు గాయం.. ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్
జిమ్‌లో క్రీడా గాయానికి గురైన కేసీఆర్ మనవడు హిమాన్షు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరలోనే కోలుకుంటారని కేటీఆర్ ట్వీట్ చేశారు. Click here to read the full news.
పెట్రోల్ బంకుల్లో E10, E20, E0 ఆప్షన్ ఇవ్వాలి
పెట్రోల్ బంకుల్లో E0, E10, E20 ఇంధనాలు అందుబాటులో ఉంచి, వాహనదారులకు నచ్చినది ఎంచుకునే అవకాశం ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. Click here to read the full news.
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
మియాపూర్‌లో భర్త అదృశ్యమయ్యాడంటూ ఫిర్యాదు చేసిన మహిళే, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి అతడిని హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. Click here to read the full news.
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
డిజిటల్ గవర్నెన్స్‌పై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను డిజిటలైజ్ చేసి ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని, వేధించే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. Click here to read the full news.
ప్రపంచ రాజకీయాల్లో భారత్ కొత్త శక్తి
జాతీయ ప్రయోజనాలే లక్ష్యంగా భారత్ అనుసరిస్తున్న సమతుల్య, మల్టీ-అలైన్‌మెంట్ విదేశాంగ విధానం అమెరికా, రష్యా, ఇరాన్ వంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేస్తూ ప్రపంచ వేదికపై దేశ ప్రాధాన్యతను, వ్యూహాత్మక స్థానాన్ని మరింత పెంచుతోంది. Click here to read the full news.
