యువత సమాజానికి ఆదర్శంగా నిలవాలి -ఎస్సై వెంకన్న
నర్సింహులపేట, ఆంధ్రప్రభ: యువత సమాజానికి ఆదర్శంగా నిలవాలని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎస్సై వెంకన్న అన్నారు. సోమవారం మండలంలోని రామన్నగూడెం గ్రామంలో మహి మెమోరియల్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కీర్తి శేషులు శ్రావణ్ -రహీం పాషా ల స్మారక సభకు నర్సింహులపేట ఎస్ఐ వెంకన్న,కొత్త ఉపేందర్ రెడ్డి,మాజీ సర్పంచ్ బోడపట్ల నర్సయ్య లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వారి జ్ఞాపకార్ధంగా దాతలు అందించిన విరాళాలతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్,గ్రామ పంచాయతీకి కుర్చీలు టెంట్లు,సోలార్ సిసి కెమెరాలను అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ.. నేటి యువత సన్మార్గంలో నడుస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించి సమాజానికి ఆదర్శంగా నిలవడం అత్యంత ముఖ్యమని అన్నారు.
చదువు ,నైతిక విలువలు, సామాజిక సేవకు ప్రాధాన్యతనిచ్చినప్పుడే ఉజ్వల భవిష్యత్తు దేశ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు.మిత్రుల స్మారక సభను ఏర్పాటు చేయడం అభినందనీయమని స్నేహితులను అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాధిక,ఉప సర్పంచి ఉమేష్,కార్యదర్శి నరేష్,వార్డు సభ్యులు వెంకన్న,సురేష్,స్రవంతి,మాజీ సర్పంచ్ బోడపట్ల నర్సయ్య,మాజీ ఉప సర్పంచ్ మహేష్,యూత్ అధ్యక్షుడు ఉపేంద్ర చారి తదితరులు ఉన్నారు.
