Akhil Akkineni | లెనిన్‌ కోసం రంగంలోకి ఎన్టీఆర్‌

అంచనాలను పెంచేసిన మరో అప్‌డేట్‌

Akhil Akkineni | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్‌ ‘లెనిన్’ చిత్రంపై అంచనాలు మరింత పెంచే వార్తా ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నచిత్రంపై మేకర్స్‌ మరో ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ప్రారంభంలో వచ్చే శ్రీరామపురం, భారతం మిట్ట ప్రపంచాన్ని పరిచయం చేసే ప్రత్యేక వాయిస్ ఓవర్‌ను ఎన్టీఆర్‌ అందించనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ వాయిస్‌ ఇస్తున్న ఫోటోలను నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

“A world born out of conviction. Introduced by a voice that needs no introduction” అంటూ ఎన్టీఆర్ పవర్‌ఫుల్ వాయిస్‌తో సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్లు వెల్లడించింది.

ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్‌కు మంచి స్పందన లభించగా, ఇప్పుడు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కూడా తోడవడంతో ‘లెనిన్’పై చర్చ మరింత ఊపందుకుంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్లను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. కాగా లెనిన్‌ చిత్రం జూలై 10న థియోటర్లలో విడుదల కానుంది.