సర్ ఫారాల కోసం హెల్ప్‌లైన్ డెస్క్ ఏర్పాటు..

పరకాల, ఆంధ్రప్రభ: సర్ (ఎస్‌ఐఆర్) ఫారాలు నింపడంలో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పరకాల పురపాలక సంఘం 9వ వార్డు కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారి తన సొంత ఖర్చులతో హెల్ప్‌లైన్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు.

ఇటీవల బీఎల్‌వోలు 9వ వార్డులో ప్రతి ఇంటికి సర్ ఫారాలు పంపిణీ చేశారు. అయితే వాటిని నింపడంలో పలువురు ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో చేనేత సంఘం సమీపంలో హెల్ప్‌లైన్ డెస్క్‌ను ఏర్పాటు చేసి వారికి సహాయం అందించారు.

ఈ సందర్భంగా సర్ ఫారాలను ఎలా నింపాలో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ఫారాలు పూర్తి చేయడంలో అవసరమైన సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌వోలు రమాదేవి, శిరీష, బీఎల్‌ఏ దాసరి వెంకన్న, సంఘ నరేష్, ఆశా వర్కర్ శైలజ, వార్డు ప్రజలు పాల్గొన్నారు.