జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ సర్క్యులర్ జారీ చేయాలి..
మునుగోడు, ఆంధ్రప్రభ : జర్నలిస్టుల కుటుంబ సభ్యుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించే సర్క్యులర్‌ను వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నల్లగొండ జిల్లా కమిటీ పిలుపు మేరకు జర్నలిస్టులు సోమవారం మునుగోడు మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
అనంతరం మండల విద్యాధికారి తలమల్ల మల్లేశంకు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ అమలుకు అధికారులు తక్షణమే సర్క్యులర్ జారీ చేసి, విద్యాసంస్థలకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు.
