నేడు అచ్చంపేట పబ్లిక్ క్లబ్‌లో మెగా కంటి వైద్య శిబిరం

  • తెల్ల రేషన్ కార్డు దారులకు ఉచిత కంటి శస్త్రచికిత్స

అచ్చంపేట, ఆంధ్రప్రభ: అచ్చంపేట పబ్లిక్ క్లబ్ ఆధ్వర్యంలో, శ్రీ మహాలక్ష్మి మాక్స్ విజన్ ఐ హాస్పిటల్ (ఈహెచ్‌ఎస్) సహకారంతో మంగళవారం ఉదయం 10 గంటలకు ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించనున్నట్లు పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడు అంగిరేకుల బిక్షపతి, ప్రధాన కార్యదర్శి మనోహర్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ శిబిరంలో ప్రముఖ నేత్ర వైద్యుల బృందం కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్య సలహాలు అందించనుంది. కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి కంటి శస్త్రచికిత్స అవసరమైతే పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్యం అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.

ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఉచిత సేవలను వినియోగించుకోవాలని పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు విజ్ఞప్తి చేశారు.