బాబూ జగ్జీవన్ రామ్ ఆశయ సాధనే కాంగ్రెస్ లక్ష్యం

  • రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధికార ప్రతినిధి, గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గరిసెల సురేందర్ ముదిరాజ్

మేడ్చల్, ఆంధ్రప్రభ: దళితుల ఆశాజ్యోతి, రైతుల నాయకుడు, మాజీ ఉప ప్రధాని, భారతరత్న బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్ కేంద్రంలో ఘనంగా నివాళులు అర్పించారు.

గుండ్లపోచంపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధికార ప్రతినిధి, గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గరిసెల సురేందర్ ముదిరాజ్, గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బేరి ఈశ్వర్ మాట్లాడుతూ, బాబూ జగ్జీవన్ రామ్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, సామాజిక సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడారు.

“భూమి దున్నేవాడికే భూమి” అనే నినాదంతో ఆయన పేదల జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు. బాబూ జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిస్తూ, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా పాలనను మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. బాబూజీ ఆశయాల సాధనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టికాడి విజయకుమార్, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకుడు అమరం సురేష్ రెడ్డి, కావేరి శేఖర్ ముదిరాజ్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు దొడ్ల మోహన్ ముదిరాజ్ తదితరులు పాల్గొని బాబూ జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించారు.