పర్యాటకుల సండే సందడి..
- బోగత జలపాతం లో కిక్కిరిసిన పర్యాటకులు
వాజేడు, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చిక్కుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతం వరద నీటితో కళకళలాడుతుంది. మగత అందాలను విరజిమ్ముతో ప్రకృతి ప్రేమికులను అలరింప చేస్తుంది ఈ బోగత జలపాతం అందాలను తిలకించడానికి తెలంగాణ చతిస్గడ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నలుమూలల నుండి పర్యాటకులు అత్యధికంగా తరలివస్తున్నారు.
ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దీనితో బోగత జలపాతం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. ఎటు వైపు చూసిన ప్రకృతి ప్రేమికులు బొగత జలపాతం అందాలను వీక్షిస్తూ బొగత కొలనులో జలకాలాడుతూ.. కేరింతల నడుమ ఆహ్లాదాన్ని పొందుతున్నారు. పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా తరలివచ్చిన పర్యాటకులు రోజంతమానం జలపాత ప్రాంగణంలో గడిపి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు బొగత జలపాతం సందర్శకుల తాకిడి గణనీయంగా పెరుగుతుంది.
