క్షణాల్లో కార్ డ్రైవర్ ను బుక్ చేసుకోవచ్చిలా..
- UDrivo యాప్‌తో నిమిషాల్లోనే మీ ముంగిట మీ సారధి..
- డ్రైవర్లకూ నెలకు రూ.60వేల వరకు ఆదాయం…
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కారు యజమానులకు రెగ్యులర్ కార్ డ్రైవర్ రాలేదనే చింత ఇక అవసరం లేదు. మీ డ్రైవర్ రాకపోయినా, అకస్మాత్తుగా డ్యూటీ మానేసినా ఇక బేఫికర్. టెంపరరీ డ్రైవర్ల కోసమూ వెతకాల్సిన అవసరం లేదు. అలా అన్ని సేవలూ ఇక నుంచి ఒకే యాప్ లో లభిస్తాయి. ఆదివారం నుంచి హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి.
హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన UDrivo యాప్ దేశవ్యాప్తంగా కార్ డ్రైవర్ హైరింగ్ సేవలను వేగంగా విస్తరిస్తోంది. ప్రముఖ సామాజిక సేవకులు మేరుగు అశోక్ సారథ్యంలో, తుప్పరి సుహాసిని మేనేజింగ్ డైరెక్టర్‌గా, కొక్కరకొండ మౌనిక డైరెక్టర్‌గా, కొక్కరకొండ సుధాకర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా నాయకత్వం వహిస్తున్న ఈ UDrivo యాప్ ద్వారా వినియోగదారులు కేవలం నిమిషాల వ్యవధిలోనే వెరిఫైడ్ ప్రొఫెషనల్ కార్ డ్రైవర్లను బుక్ చేసుకునే అవకాశం ఉంది.
వినియోగదారులు బుక్ చేసుకునే డ్రైవర్ ఎంత సమయం సేవలు అందిస్తే, అంత సమయానికే వేతనం చెల్లించేలా గల పారదర్శక ధరల విధానాన్ని UDrivo అమలు చేస్తోంది. Google Play Store, Apple App Storeలో అందుబాటులో ఉన్న ఈ యాప్ లో ఇప్పటి వరకు 25వేల మందికి పైగా కార్ డ్రైవర్లు వారి పేర్లను ఈ యాప్‌లో నమోదు చేసుకోవడం గమనార్హం. 5,500మందికి పైగా వెరిఫైడ్ డ్రైవర్లతో దేశంలోని ప్రధాన నగరాల్లో విజయవంతంగా వినియోగదారులకు ఈ సంస్థ సేవలను అందిస్తోంది.
అసంఘటితంగా ఉన్న కార్ డ్రైవర్ నియామక రంగాన్ని సాంకేతికతతో సంఘటిత రంగంగా మార్చడంతో పాటు, డ్రైవర్లు గౌరవప్రదమైన, స్థిరమైన ఆదాయాన్ని సంపాదించేలా చేయడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ క్రమంలో రాబోయే ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 1 లక్ష మంది ప్రొఫెషనల్ కార్ డ్రైవర్లను ఈ ప్లాట్‌ఫాంలో ఆన్‌బోర్డ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వారు వెల్లడించారు. UDrivo ద్వారా కార్ డ్రైవర్‌గా పనిచేసే వారు డిమాండ్, పని గంటలు, సేవల లభ్యతను బట్టి నెలకు రూ.60వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
