దివాకర్‌రావుకు చెన్నూరులో పోలీసుల అడ్డుకట్టు..
చెన్నూర్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ పరిశీలన నేపథ్యంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావును చెన్నూరు పోలీసులు ఆదివారం అడ్డుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు తన అనుచరులతో కలిసి చెన్నూరు జాతీయ రహదారి మీదుగా కన్నెపల్లి వైపు వెళ్తుండగా, చెన్నూరు టౌన్ సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలోని పోలీసులు ఆయన వాహనాలను నిలిపివేశారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా అమలులో ఉన్న భద్రతా ఏర్పాట్లలో భాగంగానే పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.
