ఆలయ నిర్మాణ దాత దంపతులకు గ్రామస్తుల సన్మానం
బాసర, (ఆంధ్రప్రభ): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ప్రధాన ఆలయ పునర్నిర్మాణానికి ముందుకొచ్చిన హైదరాబాద్‌కు చెందిన సూరపనేని సునంద్–పద్మప్రియ దంపతులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఆలయ నిర్మాణ బాధ్యతను స్వచ్ఛందంగా చేపట్టిన దాత దంపతులకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణానికి దాతలు ముందుకు రావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తయ్యేలా గ్రామస్తులందరూ తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
