Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్
ఈనెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు
Monsoon Session | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్‌ను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
ఆగస్టు 13 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన చర్చలు జరగనున్నాయని, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వివిధ బిల్లులు, దేశానికి సంబంధించిన కీలక విధానాలపై చర్చలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
