బలహీన వర్గాలకు అండగా నిలిచిన మహానేత రంగా: ఎమ్మెల్యే బొండా ఉమా
రంగా విగ్రహ స్థలానికి శంకుస్థాపన..
పేదలకు పండ్లు, విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ
పాయకాపురం/విజయవాడ, ఆంధ్రప్రభ: బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి వారి హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానేత స్వర్గీయ వంగవీటి మోహనరంగా అని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. రంగా ఆశయాల కోసం తాము నిరంతరం పాటుపడుతున్నామని పేర్కొన్నారు.
వంగవీటి మోహనరంగా 79వ జయంతి సందర్భంగా శనివారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ బస్టాండ్ సమీపంలోని స్క్రాప్ పార్క్‌లో ఏర్పాటు చేయనున్న స్వర్గీయ వంగవీటి మోహనరంగా విగ్రహ స్థలానికి ఎమ్మెల్యే బొండా ఉమా శంకుస్థాపన చేశారు.
అనంతరం 26వ డివిజన్ చుట్టుగుంట సిగ్నల్ వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 27వ డివిజన్ సాంబమూర్తి రోడ్డులోని గులాబీ తోట అన్నా క్యాంటీన్ పక్కన ఉన్న రంగా విగ్రహం వద్ద కూడా నివాళులర్పించారు.
29వ డివిజన్ మధురానగర్ అప్పలమిల్లి సెంటర్, 58వ డివిజన్ నందమూరి నగర్ సాయిబాబా గుడి, 60వ డివిజన్ వాంబే కాలనీ స్కూల్ సెంటర్, పైపుల రోడ్డు సెంటర్, 63వ డివిజన్ రాజీవ్ నగర్ సెంటర్, పాయకాపురం ప్రాంతాల్లో జరిగిన రంగా జయంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బొండా ఉమా పాల్గొని రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ప్రకాశ్ నగర్ సెంటర్‌లో జరిగిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే బొండా ఉమా కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు విద్యార్థులకు నోటుబుక్స్ అందజేశారు.
ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు ఆకుల సూర్యప్రకాశ్, బత్తుల కొండా, నిజాంపట్నం సుధాకర్, చెన్న సాయి, నవీన్, పైడి తులసి శ్రీను, కంచేటి నాగరాజు, లబ్బ వైకుంటం, మోదుగుల తిరుపతమ్మ, మోతుకురి ఖాసిమ్, కోలా శ్రీను, పెద్ది శ్రీను, పిరియా సోము, రాజానా బంగారు నాయుడు, బుదాల సురేష్, డీడీ దుర్గారావు, దొడ్ల చిన్నారావు, పసుపులేటి వీరస్వామి, కంచి ధన, జటాధర్, ఎస్.కే. మెహెరుద్దీన్, తాడిశెట్టి నాగలక్ష్మి, ఉప్పతల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
