ప్రహరీ లేక వాగులోకి దూసుకెళ్లిన కారు..
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం సిరిపురం సమీపానగల వీరన్నవాగుపై గల బ్రిడ్జికి ప్రహరీ లేకపోవడంతో ఓ కారు(ఏపీ 40 హెచ్ జె ,3222)వాగులో బోల్తా పడిన సంఘటన సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం వీరన్నవాగుపై ఉన్న బ్రిడ్జికి ఇరువైపులా ప్రహరీ లేదు ఈ కారణంగా ఈ మార్గంలో వెళ్లేవారు వేగంగా వెళ్లిన సమయంలో కారు వాగులోకి దూకింది.
ప్రమాద సమయంలో కారులో ఉన్నవారు బయటికి వచ్చినప్పటికీ కారు వాగులో బోల్తా పడింది. గత కొన్నేళ్లుగా ఈ వాగు బ్రిడ్జిపై ప్రహరీ నిర్మించాలని స్థానికులు కోరుతున్నప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. గతంలో పలుమార్లు ద్విచక్ర వాహనదారులు ఈ వాగులో పడి గాయాలపాలైన సంఘటనలు ఉన్నాయి. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఈ వీరన్న వాగుపై గల బ్రిడ్జిపై ప్రహరీ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ ఈ విషయంలో స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
