Telangana | ఆరెంజ్ అలర్ట్ జారీ
Telangana | ఆరెంజ్ అలర్ట్ జారీ
Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణలో రాబోయే శని, ఆదివారాల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ రంగు హెచ్చరికలు జారీ చేసింది.
అలాగే రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో, ఒడిశా–పశ్చిమబెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాల ప్రభావం పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఇక శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే ఓ మోస్తరు వర్షాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.
