మద్యం తాగుడు వద్దన్నందుకు..

విరక్తితో వడ్రంగి మృతి..
జన్నారం, ఆంధ్రప్రభ : మద్యం సేవించడం మానుకోమన్నందుకు జీవితంపై విరక్తితో మంచిర్యాల జిల్లా జన్నారంవాసి, వడ్రంగి దేవరకొండ తిరుపతి (59) వుడ్ పాలిష్ తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ బుధవారం సాయంత్రం తెలిపారు. తిరుపతి గత సంవత్సర కాలంగా మద్యానికి బానిసై ఏలాంటి పనులు చేయకుండా తిరుగుతూ ఉండేవాడని, కుటుంబ సభ్యులు మద్యం తాగుడు మానుకోవాలని నచ్చజెప్పినప్పటికీ అతను జీవితంపై విరక్తి చెంది మద్యం తాగిన మత్తులో ఇంట్లోని వుడ్ పాలిష్ ను మంగళవారం మధ్యాహ్నం తాగాడని ఆయన తెలిపారు.

ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సాయంత్రం చనిపోయినట్లు ఆయన చెప్పారు. మృతుని కుమారుడు దీపక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.