సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.
పాయకాపురం, ఆంధ్రప్రభ : సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక 59వ డివిజన్ సింగ్‌నగర్ లూనా సెంటర్లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పించన్ అందజేశారు.
సంక్షేమం, అభివృద్ధి రెండు చక్రాల్లా రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నదని అన్నారు.
ఈ సందర్భంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తదితర లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్ నగదును అందజేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజన బంగారునాయుడు, నందేటి ప్రేమ్, ప్రధాన కార్యదర్శి బుదాల సురేష్,పార్లమెంట్ కార్యదర్శి ఎస్.కే.గౌసియా, సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పైడితలసి,వింజమూరి సతీష్, మరక శ్రీనివాస్, బీజేపీ రత్నకుమారి, డోల జనార్ధన్ పాల్గొన్నారు. స్థానిక64వ డివిజన్ ప్రాంతంలో ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు టీడీపీ64వ డివిజన్ అధ్యక్షుడు కె. రవికుమార్ వీఎంసీ సిబ్బందితో కలసి పించన్ అందజేశారు. స్థానిక58వ డివిజన్ ప్రాంతంలో ఎమ్మెల్యే బొండా ఉమా ఆదేశాల మేరకు టీడీపీ ఇంచార్జి పిరియా సోమేశ్వరరావు,దాసరి కనకారావు,అధ్యక్షుడు కె.దుర్గారావు, వీఎంసీ సిబ్బందితో కలసి పించన్ అందజేశారు. స్థానిక62వ డివిజన్ ప్రాంతంలో ఎమ్మెల్యే బొండా ఉమా ఆదేశాల మేరకు టీడీపీ అధ్యక్షుడు జలకం రాజారావు,ఇంచార్జి పైడి శ్రీను తులసి లబ్ధిదారులకు పించన్ అందజేశారు.
