Road accident | ఆర్టీసీ బస్సు ఢీ…

గాజువాక శ్రీనగర్ జాతీయ రహదారిపై విషాదం..

ఘటనాస్థలికి చేరుకున్న దువ్వాడ పోలీసులు

Road accident |విశాఖపట్నం, ఆంధ్రప్రభ: విశాఖపట్నంలోని గాజువాక శ్రీనగర్ జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఘటనాస్థలంలోనే మృతి చెందారు.

సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు ప్రారంభించారు. మృతుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.