AP EAPCET 2026 Results | విద్యార్థుల విజ్ఞప్తితో వాయిదా

AP EAPCET 2026 Results | విద్యార్థుల విజ్ఞప్తితో వాయిదా

AP EAPCET 2026 Results | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ (AP EAPCET-2026) ఫలితాలు షెడ్యూల్ ప్రకారం విడుదల కాకపోవడంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి జూన్ 1న ఫలితాలు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, పలు కారణాలతో వాటిని వాయిదా వేశారు.

ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ అమలు చేయాల్సి ఉండటంతో పాటు, ద్వితీయ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు, సీబీఎస్‌ఈ 12వ తరగతి సవరించిన ఫలితాలు పూర్తిగా అందుబాటులోకి రాకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

విద్యార్థుల అభ్యర్థనను కూడా పరిగణనలోకి తీసుకుని ఫలితాల విడుదలను వాయిదా వేసినట్లు సమాచారం. ప్రస్తుతం అన్ని ప్రక్రియలు పూర్తిచేసి గురువారం ఈఏపీసెట్-2026 ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.