ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేసిన స్ట్రాబెర్రీ మూన్ !!

  • ఎర్రటి ఛాయతో మెరిసిన పౌర్ణమి చంద్రుడు..
  • ఆకాశాన్ని తిలకించిన నగరవాసులు

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ ఆకాశంలో అరుదైన ‘స్ట్రాబెర్రీ మూన్’ కనువిందు చేసింది. ఎర్రటి, నారింజ రంగు ఛాయలతో మెరిసిన పౌర్ణమి చంద‌మామ‌ నగరవాసులను ఆకట్టుకుంది. పలువురు ఈ అందమైన దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధిస్తూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

‘స్ట్రాబెర్రీ మూన్’ అనే పేరు చంద్రుడు ఎర్రగా మారడం వల్ల రాలేదు. ఉత్తర అమెరికాలో స్ట్రాబెర్రీ పండ్ల కోత ప్రారంభమయ్యే కాలంలో వచ్చే జూన్ పౌర్ణమికి సంప్రదాయంగా ఈ పేరు పెట్టారు. అయితే చంద్రుడు హోరైజన్‌కు సమీపంలో ఉన్నప్పుడు వాతావరణంలోని ధూళి, తేమ కారణంగా ఎర్రటి లేదా నారింజ రంగులో కనిపించడం వల్ల ఈ దృశ్యం మరింత ఆకర్షణీయంగా మారుతుంది.