సోమదేవరపల్లి సర్పంచ్‌కు ఘన సన్మానం
- శాలువాతో సత్కరించిన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శీలం అనిల్
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : ధర్మసాగర్ మండలం సోమదేవరపల్లి గ్రామ సర్పంచ్ క్రిష్ణమూర్తి ఎల్కతుర్తి గ్రామానికి విచ్చేసిన సందర్భంగా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శీలం అనిల్ శాలువాతో సన్మానించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు గ్రామాభివృద్ధి అంశాలపై చర్చించడంతో పాటు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నెట్ కుమార్, వెంకన్న, కాసగోని రాజు, శ్రావణ్ కుమార్, మంద మొగిలి తదితరులు పాల్గొన్నారు.
