ఓటరు జాబితా ప్రక్షాళన పారదర్శకంగా జరగాలి

ఓటరు జాబితా ప్రక్షాళన పారదర్శకంగా జరగాలి

అర్హులందరి పేర్లు నమోదు చేయాలి.. అనర్హుల పేర్లు తొలగించాలి
ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, ఆంధ్ర ప్రభ : అచ్చంపేట పట్టణంలోని సాయి నగర్ కాలనీలో ఎస్‌ఐఆర్ (సర్) ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ఓటరు జాబితా ప్రక్షాళన కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు, బూత్ లెవల్ ఏజెంట్లుi, అలాగే ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ఓటరు జాబితా ప్రక్షాళనను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు కావాలని, అనర్హుల పేర్లను తొలగించే ప్రక్రియను నిష్పక్షపాతంగా చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజలు తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడూ తన ఓటు హక్కును కాపాడుకునేలా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బీఎల్‌ఏలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.