ఘనంగా మిత్ర యూత్ 27వ వార్షికోత్సవం..
- నూతన కమిటీని ఎన్నుకున్న సభ్యులు
మోత్కూర్, ఆంద్రప్రభ : మున్సిపల్ కేంద్రంలో మిత్ర యూత్ 27వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ ద్వారా నిర్వహించిన కార్యక్రమాలను వివరించి సేవలందించిన సభ్యులను సన్మానించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా బత్తిని శ్రీశైలం, ఉపాధ్యక్షునిగా తాడూరు నరేందర్, ప్రధాన కార్యదర్శిగా పయ్యాంల శ్రీను, కోశాధికారిగా ఏల నగేష్, సహాయ కార్యదర్శులుగా బుర్ర రవి, మోత్కూరు ప్రదీప్‌శర్మ, కట్టెకోల మహేష్, ప్రచార కార్యదర్శులుగా ఎడ్ల నాగరాజు, ఇక్కిరి నాగరాజు, కార్యవర్గ సభ్యులుగా పురుగుల వెంకన్న, కనుకు సత్యం, పిట్టల బాలయ్య, గుండు ఆంజనేయులు, జెల్ది శ్రీను, కొయ్యలకారి వెంకన్న, గొడిశాల శ్రీను, ఎరుకల నర్సయ్య, వాసం ప్రసాద్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు మాజీ కౌన్సిలర్ పురుగుల వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, మార్కెట్ డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి, యూత్ సభ్యులు కొంతం మల్లేష్, కొయ్యలకారి నవీన్, జంగ సతీష్, పోతరబోయిన నగేష్, శంకర్, బైరు వెంకన్న, షబ్బీర్, కనుకు రాజు, పాండు, వెంకన్న, ఎడ్ల భీముడు, సతీష్, ఉపేంద్రాచారి, అనిల్, శివమల్లేష్, శేఖర్, నర్సింహ, సీతయ్య తదితరులు పాల్గొన్నారు.
