Trailer Release | లెనిన్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Trailer Release | లెనిన్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
● జూన్ 30న హైదరాబాద్‌లో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్
● జూలై 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న అఖిల్ చిత్రం
Trailer Release | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: అక్కినేని అఖిల్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘లెనిన్’ సినిమా నుంచి అభిమానులకు మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను జూన్ 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నారు.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో అఖిల్‌ను పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 10, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచగా, ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
