జగన్మాతను దర్శించుకున్న ఎంపీ లింగమనేని.
లింగమనేని రమేష్ కు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం..
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ..
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మవారిని రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ దర్శించుకున్నారు. ఆదివారం అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఆయనకు ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు.
అమ్మవారికీ ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ లింగమనేని రమేష్ కు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, దర్గా గుడి చైర్మన్ బుర్ర గాంధీ అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు.
