108 అంబులెన్స్ సేవతో చిన్నారులకు పోలియో చుక్కలు..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పోలియో కేంద్రానికి వెళ్లలేని చిన్నారులకు 108 అంబులెన్స్ సిబ్బంది అండగా నిలిచారు. ఉట్నూర్ పరిధిలోని హస్నాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి చిన్నారులను సురక్షితంగా తరలించి పోలియో చుక్కలు వేయించారు.

108 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సామ్రాట్, జిల్లా మేనేజర్ మనోహర్ ఆదేశాల మేరకు డాక్టర్ సాయికిరణ్, పైలట్ బత్తుల అంజన్న ఆధ్వర్యంలో ఈ సేవలు అందించారు.

పోలియో కేంద్రానికి స్వయంగా వెళ్లలేని చిన్నారులను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తీసుకువచ్చి వారికి పోలియో చుక్కలు వేయించడంతో వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బంది 108, 102 అత్యవసర సేవల సిబ్బందిని అభినందించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు.