పీవీ నరసింహారావు సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
నాగర్కర్నూల్, ఆంధ్రప్రభ: నాగర్కర్నూల్ పట్టణ కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ పీవీ నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పీవీ కాంస్య విగ్రహానికి నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశానికి పీవీ నరసింహారావు అందించిన సేవలు, ఆర్థిక సంస్కరణలు చిరస్మరణీయమని కొనియాడారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ఆయన పోషించిన పాత్ర ఎంతో గొప్పదని, ఆయన చూపిన బాట అందరికీ మార్గదర్శకమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్, వైస్ చైర్మన్ బాదం రమేష్, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు, కౌన్సిలర్లు అవంచ మాధవిరాజు, మొహ్మద్ నిజాముద్దీన్, పడిగే శంకర్, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
