చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యం..

పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి

లక్ష్మీసాగర్‌లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ బాణవత్ రాజు నాయక్

కడెం, ఆంధ్రప్రభ: కడెం మండలంలోని లక్ష్మీసాగర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ బాణవత్ రాజు నాయక్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్లలోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పిల్లల ఆరోగ్య పరిరక్షణలో ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కడెం మాజీ ఎంపీపీ బి. అమ్మి బాపూరావు, స్థానిక ఏఎన్‌ఎం జి. జ్యోతి, అంగన్‌వాడీ టీచర్ సునీత, ఆశా వర్కర్ జి. స్వప్న, వార్డు సభ్యులు శీను, రాధ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.