Tirumala28june26 | తిరుమల కొండ కిట‌కిట‌

Tirumala28june26 | తిరుమల కొండ కిట‌కిట‌

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 30గంట‌లు
కొన‌సాగుతున్న భక్తుల రద్దీ
నిన్న ఒక్క‌ రోజే రూ.3.76 కోట్ల హుండీ ఆదాయం
జూన్‌ 27న 85,582 మంది భక్తులకు శ్రీవారి దర్శనం
సర్వదర్శనానికి సుమారు 30 గంటల నిరీక్షణ..
బాట గంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్

Tirumala28june26 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బాట గంగమ్మ ఆలయం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. నేడు సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం30 గంటల సమయం పడుతుందని చెల్లించనున్న తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 85,582 మంది భక్తులు దర్శించుకున్నారు. 44,155 మది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.70 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు. ఈరోజు దివ్యదర్శనం టోకెన్లున్న భక్తులకు ఏడు గంటల సమయం పడుతుంది. శీఘ్రదర్శనం టోకెన్లున్న వారికి నాలుగు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. నిన్న 4.66 లక్షల లడ్డూ ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. 3.43 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అదే రోజు టీటీడీ నిర్వహిస్తున్న వైద్య సేవల ద్వారా 3,583 మంది భక్తులకు చికిత్స అందించారు.