భీమ్గల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..
- రూ.1.55 లక్షలకుపైగా ఆర్థిక సాయం అందజేత
భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ : ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆదివారం భీమ్గల్ పట్టణంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బాల్కొండ నియోజకవర్గం బాధ్యులు శ్రీ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో మొత్తం రూ.1,55,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ పర్శ అనంత్ రావు మాట్లాడుతూ, పేద ప్రజలకు వైద్య చికిత్సల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోందని అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయానికి, అలాగే తమ దరఖాస్తులు మంజూరు అయ్యేలా సహకరించిన ప్రజాప్రతినిధులు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ పట్టణ అధ్యక్షుడు పర్శ అనంతరావు, స్థానిక కౌన్సిలర్లు మమరి సందీప్, అంజుమ్, నాయకులు వాకా మహేష్, సాయిబాబా, భూషణ్, దినేష్, మహేష్, కిరణ్, మీసాల నవీన్ తదితరులు పాల్గొన్నారు.
