శాఖల సమన్వయంతోనే కార్మికులకు న్యాయం
- బాండెడ్ లేబర్ నిర్మూలనే లక్ష్యం..
- ప్రభుత్వ ప్లీడర్ బొట్ల సుధాకర్ సూచన..
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : శాఖల మధ్య సమన్వయం పెరిగితేనే కార్మికులకు సత్వర న్యాయం అందుతుందని ప్రభుత్వ ప్లీడర్ బొట్ల సుధాకర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఎఫ్‌ఎంఎం సోషల్ సర్వీస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో పట్టణ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.బాండెడ్ లేబర్ వ్యవస్థ నిర్మూలన, కార్మికుల అక్రమ రవాణా నివారణ, కార్మిక సంక్షేమ పథకాల సమర్థ అమలు కోసం రెవెన్యూ, పోలీసు, కార్మిక శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ లక్ష్యంతోనే సంబంధిత శాఖల అధికారులు, పారా లీగల్ వాలంటీర్లకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.కార్యక్రమంలో లేబర్ అధికారి వినోద్, పలిమెల తహసీల్దార్ రాజేశ్వర్ రావు, సీఐ కరుణాకర్ రావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు కె. దామోదర్, నాయబ్ తహసీల్దార్లు అంజలి రెడ్డి, ఎం.డి. అబ్దుల్, బి. శ్రీలత, పి. భాస్కర్, ఎస్‌ఐలు రమణయ్య, రవళి రెడ్డి, రాజేష్ కుమార్, రాజన్ కుమార్, ఎఫ్‌ఎంఎం సోషల్ సర్వీస్ సొసైటీ డైరెక్టర్ సిస్టర్ సహాయ, ప్రోగ్రామ్ మేనేజర్లు కరుణ, శ్రీకాంత్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఇక్బాల్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి వెంకటస్వామి, రాజాకొమురయ్య, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ తిరుపతి, పారా లీగల్ వాలంటీర్లు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
