స్మోకింగ్ జోన్లపై పెద్దపల్లి పోలీసుల మెరుపు దాడులు..

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి పట్టణంలోని బహిరంగ ధూమపాన కేంద్రాలు (స్మోకింగ్ జోన్లు) లక్ష్యంగా శనివారం పెద్దపల్లి పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.

సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో టౌన్, రూరల్ పోలీసు బృందాలు ఏకకాలంలో పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తున్న పలువురికి కోప్టా (COTPA) చట్టం ప్రకారం జరిమానాలు విధించారు.

ఈ సందర్భంగా సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, కోప్టా చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ధూమపాన ఉత్పత్తుల విక్రేతలు, దుకాణాల యజమానులకు చట్టంలోని నిబంధనలపై అవగాహన కల్పిస్తూ కౌన్సెలింగ్ నిర్వహించారు.

ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసే వారిపైనా, నిబంధనలకు విరుద్ధంగా స్మోకింగ్ జోన్లు నిర్వహించే వారిపైనా కోప్టా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో టౌన్ ఎస్‌ఐ కె. నరేష్, రూరల్ ఎస్‌ఐ మధుకర్, ఎస్‌ఐ నరేష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.