వృద్ధుడి ఆత్మహత్య,

చిట్యాల, ఆంధ్రప్రభ : అనారోగ్యంతో, కంటిచూపు మందగించడంతో మనస్తాపానికి గురై వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నసంఘటన ఈ రోజు మండలంలోని ఓడి తలలో జరిగింది. చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ తెలిపిన వివరాల ప్రకారం ​ఒడితల గ్రామానికి చెందిన తెలకుంట్ల సమ్మయ్య (76) గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు.

గత ఏడాది కాలంగా ఆయనకు రెండు కళ్ళు పూర్తిగా కనిపించకపోవడంతో పక్షవాతం లక్షణాలు ఉన్న తన భార్య రాజవ్వ సహాయంతోనే దినచర్యలు సాగించేవారు. కళ్ళు కనిపించకపోవడం వల్ల తను భార్యాపిల్లలకు బరువుగా మారాననే తీవ్ర మనస్తాపంతో సమ్మయ్య ఉరివేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. ​మృతుని కుమారుడు తిరుపతి ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ పోచంపల్లి సతీష్ తెలిపారు.