ఎస్ఐఆర్ ప్రక్రియ సమగ్రంగా నిర్వహించాలి..
ఉట్నూర్ ఆర్డీవో మోహన్ సింగ్..
జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : ఎస్ఐఆర్ ప్రక్రియ సమగ్రంగా నిర్వహించాలని ఉట్నూర్ ఆర్డీవో మోహన్ సింగ్ తెలిపారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మురిమడుగు, ఇందనపల్లి, తొమ్మిదిగుడిసెలపల్లి, పోలింగ్ స్టేషన్ ఉట్నూర్ ఆర్డీవో, ఆర్డీఓ కార్యాలయ పరిపాలన అధికారి సబ్బ రమేష్ శుక్రవారం మధ్యాహ్నం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. ఇంటింటి సర్వేను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను సమర్థవంతంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ప్రతి అర్హుడైన ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారములు అందేలా చూడాలని బీఎల్ఓ లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ బక్కయ్య మండల గిర్దవార్ వెంకటేశం, జీపీఓలు, బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు.
