ఘనంగా మొహర్రం పండుగ వేడుకలు

  • మతసామరస్యానికి ప్రతీక మొహర్రం
  • ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, ఆంధ్రప్రభ : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం పండుగను మండలం లోని కాట్రపల్లి గ్రామంలో గ్రామస్థులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మొహర్రం పండుగ చివరి రోజున నిర్వహించిన పీరీల ఊరేగింపు కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా, కోలాహలంగా సాగింది.ఈ కార్యక్రమానికి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై,గ్రామంలో నిర్వహించిన ఊరేగింపులో పాల్గొని పీరీలకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన గ్రామ ప్రజలకు, ముస్లిం సోదరులకు మొహర్రం పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పరుపాటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుత.. మొహర్రం పండుగ త్యాగానికి, నిజాయితీకి, ధర్మానికి ప్రతీక. ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ పండుగ మనకు ఎన్నో విలువలను నేర్పుతుంది. హిందూ, ముస్లిం సోదరులు కలిసి మెలిసి పండుగను జరుపుకోవడం మన తెలంగాణ సంస్కృతి గొప్పతనం. కాట్రపల్లి గ్రామంలో ఏళ్ల తరబడి అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా పీరీల పండుగను జరుపుకోవడం ఆదర్శనీయం.మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్ఫూర్తితో నియోజకవర్గంలో అన్ని మతాల పండుగలను, సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రజలకు అండగా ఉంటున్నాం.

మత సామరస్యం కాపాడటమే మనందరి బాధ్యత. సమాజంలో సోదరభావం, ఐక్యత మరింత పెంపొందాలని, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా గ్రామ అభివృద్ధికి, అన్ని వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు పాకనాటి సునీల్ రెడ్డి, రాయపర్తి మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్ నాయక్, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, కర్ర రవీందర్ రెడ్డి, ఐత రామ్ చందర్, సంధి దేవేందర్ రెడ్డి, చందు రామ్, సంకినేని ఎల్లస్వామి, ఐత జంపి, గారే నరేష్, గౌరీ సతీష్, స్థానిక బీఆర్ఎస్ ముఖ్య నాయకులు గిరిక సురేష్, ఎండీ అన్వార్, ఎండీ గుంశావాలి, ఎండీ నజర్, ఎండీ నాసర్, చెన్నబోయిన యాకయ్య, ముద్రబోయిన శ్రీనివాస్, ఎండీ ఖలీల్, సిరాజ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.