బెల్లంపల్లి కేవీకే శాస్త్రవేత్త స్రవంతి బదిలీ
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో హార్టికల్చర్ (ఉద్యానవన) శాస్త్రవేత్తగా పనిచేస్తున్న యు. స్రవంతి బదిలీ అయ్యారు. ఆమెను హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఏఆర్ఐ) మెయిన్ ఫామ్, ఫామ్ డెవలప్‌మెంట్ యూనిట్‌లో శాస్త్రవేత్తగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
బెల్లంపల్లి కేవీకేలో పనిచేసిన కాలంలో ఉద్యానవన పంటలపై రైతులకు ఎన్నో ఉపయోగకరమైన సేవలు అందించిన స్రవంతి, పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులకు సాంకేతిక సూచనలు అందించారు. బదిలీపై రాజేంద్రనగర్ వెళ్తున్న సందర్భంగా కేవీకే సిబ్బంది, స్థానిక వ్యవసాయ అధికారులు ఆమెకు అభినందనలు తెలియజేస్తూ నూతన బాధ్యతల్లో మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
