డ్రగ్స్‌కు నో చెప్పండి.. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం
టేకుమట్ల, ఆంధ్రప్రభ: డ్రగ్స్‌కు నో చెప్పండి.. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం అని ఎస్ఐ అమూల్య అన్నారు.ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ అమూల్య ఆధ్వర్యంలో విద్యార్థులు, యువతకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం ఎస్ఐ అమూల్య మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబ, సామాజిక, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు.అనుమానాస్పద వ్యక్తులు లేదా మాదకద్రవ్యాల విక్రయాల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
యువత మంచి అలవాట్లు అలవరచుకొని సమాజాభివృద్ధికి తోడ్పడాలని ఎస్ఐ అమూల్య పిలుపునిచ్చారు
