భర్త వేధింపులు తాళలేక..
నవాబుపేట్, ఆంధ్రప్రభ: నవాబుపేట్ మండలంలో భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ పోలీసులను ఆశ్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఎస్సై నరేందర్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. లింగంపల్లి గ్రామానికి చెందిన వడ్డే అమృతకు 15 సంవత్సరాల క్రితం వడ్డే శ్రీనుతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత ఐదేళ్లుగా తన భర్త తీగలపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని అమృత ఫిర్యాదులో పేర్కొంది.
ఈ విషయమై నవాబుపేట్ గ్రామ పెద్దల సమక్షంలో పలుమార్లు చర్చించినప్పటికీ, భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని ఒత్తిడి చేస్తూ, తీసుకురాకపోతే చంపేస్తానని బెదిరించేవాడని ఫిర్యాదులో పేర్కొంది.
