దమ్మపేటలో హరీశ్‌రావు కీలక సమావేశం.. పార్టీ శ్రేణులకు ఏమన్నారంటే?
దమ్మపేట, ఆంధ్రప్రభ: దమ్మపేటలో మాజీ జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు, దమ్మపేట మాజీ సొసైటీ చైర్మన్ , బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రావు జోగేశ్వరరావు నివాసంలో మంగళవారం తేనీటి విందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ పరిస్థితులపై ఆయన నాయకులను ఆరా తీశారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దమ్మపేట మండలాన్ని జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా నాయకులు , ప్రతీ కార్యకర్త కృషి చేయాలని సూచించారు.
భవిష్యత్తులో చేపట్టబోయే పార్టీ కార్యక్రమాల్లో అందరినీ కలుపుకొని పోతూ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తగిన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. అక్కడకు వచ్చిన పలువురు నాయకుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర , మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , తక్కిళ్ళపల్లి రవీంద్ర , తాతా మధు ,రాకేష్ రెడ్డి ,బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం , దమ్మపేట మాజీ వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, కోటగిరి పుల్లయ్య బాబు ,మండల పార్టీ ఉపాధ్యక్షులు గాజుబోయిన ఏసుబాబు, కూకలకుంట రవి కుమార్ ,యార్లగడ్డ శ్రీను, పానుగంటి చిట్టిబాబు, యార్లగడ్డ బాబు, శ్రీరాముల సత్యనారాయణ, రవి తేజ , రామకృష్ణ , టోపీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
