శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధనకు కృషి చేయాలి..

తొర్రూరు, ఆంధ్రప్రభ : డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయసాధనకు కృషి చేయాలని బిజెపి అర్బన్ మండల అధ్యక్షుడు ఫైండ్ల రాజేష్ అన్నారు. మంగళవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖండ భారత వాణి కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన మహనీయుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని, ఆయన స్ఫూర్తితోనే భారతీయ జనతా పార్టీ ముందుకు వెళుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలుపుల శంకర్, తొర్రూరు మండల రూరల్ అధ్యక్షుడు గట్టు రాంబాబు,మండల ప్రధాన కార్యదర్శి నడిగడ్డ సందీప్, జిల్లా నాయకులు అలిసేరి రవిబాబు,మంగళపల్లి యాకన్న, చల్వాయి సత్యనారాయణ, తూర్పాటి సాయి ముఖేష్, గంధం రాజు,సర్వి వెంకటేష్, కాసోల్ శ్రీనివాస చారి,చిన్నబ్బాయి,శ్రీకాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.