బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ నేతలు

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని సారంగాపూర్ గ్రామానికి చెందిన సందుల సాకలి రాజేశ్వర్ 14 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. తండ్రి మృతితో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన చిన్న కుమారుడు సందుల సాకలి వినీత్ కుమార్ ఫాదర్స్ డే రోజున చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం మరింత పెరిగింది.

ఈ ఘటన గురించి తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, కడెం మండల మాజీ ఎంపీపీ భూక్య అమ్మి బాపూరావు మంగళవారం సారంగాపూర్ గ్రామంలోని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి దుఃఖాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఈ క్లిష్ట సమయంలో అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో సారంగాపూర్ మాజీ సర్పంచ్ మేకల రాజారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కోల నరేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్మూర్ లచ్చన్న, పసుపుల చిన్న నరసయ్య, గజ్జి రాములు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.