బిజెపి కిసాన్ మోర్చా నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా జక్కుల సత్తన్న
కడెం, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా కడెం మండలంలోని చిన్న బెల్లాల్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు జక్కుల సత్తన్న యాదవ్ నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సూచనల మేరకు రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు బసవపురం లక్ష్మీనరసయ్య ఈ మేరకు నియామక పత్రాన్ని జారీ చేశారు.
జక్కుల సత్తన్న యాదవ్ 1991 నుంచి బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు. ఆయన ఐదు పర్యాయాలు బీజేపీ కడెం మండల అధ్యక్షుడిగా, గొర్రెకాపర్ల ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, బీజేపీ నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పలు బాధ్యతలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తనను కిసాన్ మోర్చా నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా నియమించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు బసవపురం లక్ష్మీనరసయ్యకు జక్కుల సత్తన్న యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం, పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
