తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి..

రేగొండ, ఆంధ్రప్రభ : రేగొండ మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తాటి చెట్టు ఎక్కిన గీత కార్మికుడు ప్రమాదవశాత్తు కిందపడడంతో మృతి చెందాడు.

స్థానికుల వివరాల ప్రకారం, రేగొండకు చెందిన గండి సదయ్య (55) వృత్తిరీత్యా గీత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం తాటి చెట్టు ఎక్కి గీత తీసే పనిలో ఉండగా ప్రమాదవశాత్తు కాలు జారి చెట్టు పై నుంచి కిందపడిపోయాడు.

ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో ఘటన స్థలంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సదయ్య మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.