Rain Alert Telangana | తెలంగాణలో భారీ వర్షాలు

Rain Alert Telangana | తెలంగాణలో భారీ వర్షాలు

Rain Alert Telangana | హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న రెండు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కుమురంభీం-ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.

అలాగే మధ్యాహ్నం తర్వాత ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు, ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాల సమయంలో చెట్ల కింద నిలబడకుండా, మెరుపుల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో సంచరించకుండా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Leave a Reply