సంస్థాగత బలోపేతంపై దృష్టి..
ఇచ్చోడ, ఆంధ్రప్రభ : త్వరలో ప్రారంభం కానున్న బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియపై శుక్రవారం ఇచ్చోడ మండల నాయకులతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం మరింత బలోపేతం చేయడం, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా వ్యవహరించడం వంటి అంశాలపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో ఇచ్చోడ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
