వైభవంగా ఆదిత్యుని కళ్యాణం
వైభవంగా ఆదిత్యుని కళ్యాణం
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో గురువారం ఉషా, పద్మిని, ఛాయ సమేత సూర్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.
అధిక జ్యేష్ఠ బహుళ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎన్.వి.డి.వి. ప్రసాద్ తెలిపారు.
ఆలయ అర్చకులు సందీప్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు వేదమంత్రాలు పఠించగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
