తెలంగాణ రక్షణ సేన పతాకావిష్కరణ కార్యక్రమం
తెలంగాణ రక్షణ సేన పతాకావిష్కరణ కార్యక్రమం
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని రైల్వే గేట్ సమీపంలో తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ పతాకావిష్కరణ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు.
పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కందడి మణిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు తమ్మడి పద్మారావు చేత పతాకావిష్కరణ జరిపించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు గంపల విజయ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పతాకావిష్కరణ కార్యక్రమానికి ముందు పార్టీ నాయకులు వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
