AICC | సుప్రీంకోర్టుకు కాంగ్రెస్…
AICC | సుప్రీంకోర్టుకు కాంగ్రెస్…
- మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ..
- రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏఐసీసీ పిటిషన్
ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటారజన్ నామినేషన్ పత్రాల తిరస్కరణ వ్యవహారం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఏఐసీసీ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో, మీనాక్షి నటరాజన్ నామినేషన్ అంశంపై తదుపరి పరిణామాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
