శాంతిఖని గనిపై ఆస్ట్రేలియా బృందం కీలక పరిశీలన..
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖనిబొగ్గు గనిని బుధవారం నలుగురు సభ్యుల తో కూడిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ బొగ్గు గని లో ఇంకా అపార మైన బొగ్గు నిక్షేపాలున్నందున ఈ నిని నడిపించాలని సింగరేణి సంస్థ తీసుకున్న నిర్ణయం లో భాగంగా ఆస్ట్రేలియా సాంకేతిక పరిజ్ఞానం తో బొగ్గు ఉత్పత్తి ని సాధించేందుకుఉన్నఅవకాశాలు,అవసరమయ్యే తగు సాంకేతిక పరిజ్ఞానం ఆవశ్యకత పై గని లోని పని స్థలాల ను ప్రతినిధి బృందంపరిశీలించింది.గనిలోసాలార్జింగ్ సీమ్, సౌత్, నార్త్, ఈస్ట్ బొగ్గు నిక్షేపాలు ఉన్న స్థలాలను ప్రతినిధిబృందం పరిశీలించింది.

గనిని సందర్శించిన ప్రతినిధి బృందంలో ఆస్ట్రేలియా కు చెందిన బ్రిజ్బెన్ నగరం లో ని టాలి యామన్ అనే కన్సల్ టెన్సీ కంపెనీ ( మైనింగ్ ఎక్యూప్ మెంట్ సర్వీసెస్ కంపెనీ )డైరెక్టర్ గ్రాంట్ పోల్డ్, జీ ఎం జెరార్డ్ మిల్లర్,అహ్మదాబాద్ మైనింగ్ కన్సల్ టెన్సీ నందన్,దన్బాద్ కుంచెందిన మైనింగ్ ఫ్రొఫెసర్ సిన్హా లు ఉన్నారు.కాగా ఈ ప్రతి నిధి బృందం జిఎం ఇతర అధికారులతో క్షుణ్ణంగా చర్చించి తగునివేదికనురూపొందించనున్నారు.
నివేదికను నేడు హైదరాబాదులో ని సింగరేణి భవన్ లో సీ అండ్ ఎం డీ తో జరిగే సమావేశంలో ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం పాల్గొని తగు నివేదికను సీ అండ్ ఎం డీ కి అందజేస్తారు. అంతకు ముందు ఆస్ట్రేలియా ప్రతినిధి బృందానికి జిఎం రాధాకృష్ణ, గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, గని ప్రాజెక్టు అధికారి మొహమ్మద్ అబ్దుల్ ఖదీర్,కొత్త ప్రాజెక్ట్ అధికారి ఎస్ సంతోష్ కుమార్, శాంతిఖని గ్రూప్ ఇంజనీర్ బసవరాజ్ లు ఆస్ట్రేలియా ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. గని మేనేజర్ కార్యాలయంలో శాంతిఖని బొగ్గు గని స్థితిగతులను అధికారులు ప్రతినిధి బృందానికి వివరించారు.
