Miryalaguda Road Murder Case | మిర్యాలగూడ రోడ్డులో హత్య కలకలం..

Miryalaguda Road Murder Case | మిర్యాలగూడ రోడ్డులో హత్య కలకలం..

Miryalaguda Road Murder Case | దర్యాప్తు చేపట్టిన పోలీసులు

Miryalaguda Road Murder Case | నల్గొండ, ఆంధ్రప్రభ: నల్గొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో యువకుడి హత్య కలకలం రేపింది. హ్యాపీ హోమ్స్ ఎదురుగా ఉన్న వెంచర్‌లో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంఘటనపై సమాచారం అందుకున్న తిప్పర్తి ఎస్సై శంకర్, శాలిగౌరారం సీఐ రాఘవరావు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు నల్గొండ జిల్లా కేంద్రంలోని గొల్లగూడకు చెందిన బోతు సాయి (28)గా గుర్తించారు. అతను సత్యనారాయణ కాలనీ ప్రాంతానికి చెందినవాడని తెలిపారు.

దుండగులు యువకుడిపై తీవ్రంగా దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనాస్థలిలో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ప్రత్యేక పరిశీలన చేపట్టాయి. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply